NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదోన్నతులు బదిలీలు  పొందిన ఉపాధ్యాయుల యొక్క జీతాలు చెల్లించాలి

1 min read

బదిలీలు పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి.

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్ టి యు) మండల శాఖ

హొళగుంద న్యూస్ నేడు : నేడు వివిధ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం  పదోన్నతులు మరియు బదిలీలు పొందిన ఉపాధ్యాయుల యొక్క జీతాలు చెల్లించాలని, అలాగే బదిలీలు పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, జిల్లా అదనపు కార్యదర్శి శ్రీ సుంకన్న, హొళగుంద మండల శాఖ అధ్యక్షులు వై వెంకటేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల శాఖ గౌరవ అధ్యక్షులు శ్రీ ఎస్ పోతరాజు,  మండల గౌరవ ఉపాధ్యక్షులు జి దొడ్డ బసప్ప,జిల్లా సహా కార్యదర్శి బి.టి. ఖలందర్ పాల్గొన్నారు.

About Author