వైసీపీలో జబ్బార్,మాధురి గౌడ్ కు చోటు..
1 min read

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి..డాక్టర్ సుధీర్ కు కృతజ్ఞతలు
నందికొట్కూరు, న్యూస్ నేడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ లోకి నందికొట్కూరు ఇద్దరికీ చోటు లభించింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ జబ్బార్ కు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.అదేవిధంగా వైఎస్ఆర్సిపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాధురి గౌడ్ లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం పేర్లను ప్రకటించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మాకు ఎంతో నమ్మకంతో రాష్ట్ర పదవులను అప్పగించారని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం మేము అహర్నిశలు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు అబ్దుల్ జబ్బార్ మరియు మాధురి గౌడ్ తెలిపారు. అదేవిధంగా పదవులు వచ్చినందుకుగాను పదవులు వచ్చినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలిపారు.పలువురు వైసీపీ నాయకులు జబ్బార్ కు మరియు మాధురి గౌడు లకు శుభాకాంక్షలు తెలిపారు.

