వ్యవసాయ కళాశాల విద్యార్థి మృతి
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది సమీపంలోని ఎం సి ఫారం వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న జనార్ధన్ నాయక్( 21)అనే విద్యార్థి శనివారం మృతి చెందినట్లు మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మృతుడితోపాటు మరో కొంతమంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు కళాశాల సమీపంలోని పాలేరు వాగులో బట్టలు శుభ్రపరచుకున్న అనంతరం వాగులో ఈత కొట్టడానికి దిగారని కొంతసేపు తర్వాత జనార్ధన్ నాయక్ అస్వస్థతకు గురి కావడంతో కళాశాల సిబ్బందికి తోటి విద్యార్థులు తెలియజేయడంతో పాటు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం చిత్తూరు జిల్లా పలమనేరుగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మృతుని తల్లిదండ్రులకు సమాచారం తెలియపరచడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


