బిట్ కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు…
1 min read

అన్ లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
కర్నూలు, న్యూస్ నేడు: బిట్ కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అన్ లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శనివారం తెలిపారు. బిట్ కాయిన్లో రూ. 5 వేలు పెట్టుబడి పెడితే మూడు గంటల్లోనే రూ. లక్ష అయ్యింది. కావాలంటే కింద ఉన్న స్క్రీన్షాట్లు చూడండి అంటూ కొత్త నంబర్లు లేదా తెలిసిన వ్యక్తుల నంబర్ల నుండి మీకు లింకులు వస్తున్నాయా జాగ్రత్త అది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించండని ఈ తరహా వచ్చిన లింకు తెరిచి పెట్టుబడి పెట్టండి అని మీకు సందేశం వస్తే.. ఏమాత్రం ఆలోచించకుండా లింకు తెరిచి పెట్టుబడి పెడితే అంతే సంగతులు.పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఫాలోవర్లకు నకిలీ లింకులు పంపిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మకండి ముఖ్యంగా టెలిగ్రామ్ / ఫేస్బుక్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేదానికి లింక్ వస్తే అసలు క్లిక్ చేయకూడదు.అలా క్లిక్ చేస్తే సున్నితమైన మీ డేటా వాళ్ల చేతిలోకి వెళ్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయడానికి ప్రయత్నించకండిఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని, ఈ తరహా మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

