డబ్ల్యూటిఐటిసి విదేశీ సంయుక్త కార్యదర్శిగ రామారావు దామాను నియామకం
1 min read

హైదరాబాద్, న్యూస్ నేడు : ప్రపంచ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ టెక్సాస్, డబ్ల్యూటిఐటిసి విదేశీ సంయుక్త కార్యదర్శిగ రామారావు దామాను నియామకం అమెరికా (యుఎస్ఏ) కు చెందిన అనుభవజ్ఞుడైన టెక్నాలజీ నిపుణుడు రామారావు దామాను ఎన్ ఆర్ ఐ ను సంయుక్త కార్యదర్శిగా నియమించినట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులతో సంబంధాలు మరింత బలపరచడమే లక్ష్యంగా డబ్ల్యూటిఐటిసి తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలలో ఇది ఒకటి. 20 సంవత్సరాలకు పైగా ఓరాకిల్ ఈఆర్ పి టెక్నాలజీలలో ప్రావీణ్యంతో, రామారావు దామా వాణిజ్యం, ఫైనాన్షియల్స్, మానవవనరులు, సప్లై చైన్, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి అనేక రంగాల్లో మార్పులను నడిపించడంలో కీలక పాత్ర వహించారు.“ప్రపంచ తెలుగు ప్రతిభను ఏకం చేయడమే మా లక్ష్యం. రామారావు విస్తృతమైన ప్రొఫెషనల్ అనుభవం, సామాజిక సేవపై నిబద్ధత డబ్ల్యూటిఐటిసి మరియు గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ మధ్య పటిష్ఠమైన వారధిగా ఆయనను నిలిపే అంశాలు.” అని పేర్కొన్నారు. రామారావు నియామకం డబ్ల్యూటిఐటిసి చేపడుతున్న తెలుగు టెక్నోక్రాట్ల శక్తివంతీకరణ, గ్లోబల్ భాగస్వామ్యాల ఏర్పాటు, సరిహద్దులు దాటి నూతనతకు ఊతమివ్వాలనే దిశలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది.

