హిందువులందరూ జాతి , భాష విభేదాలు మరచి కలిసికట్టుగా ఉండాలి
1 min read

శ్రీ మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు
మంత్రాలయం న్యూస్ నేడు : హిందువులందరూ జాతీయ ప్రాంతీయ విభేదాలను మరిచి కలిసికట్టుగా ఉండాలని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలోని హెచ్ఆర్బి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ముందుగా పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు హిందూ సమ్మేళన సభ్యులు , పిల్లలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సభ వేదికపై రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి, భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి , జ్యోతి ప్రజ్వలన చేసి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు మాట్లాడుతూ, హిందువులందరూ ప్రాంతీయ విభేదాలను మరచి ఐక్యమత్యంతో ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సనాతన ధర్మాన్ని ప్రాముఖ్యత తెలిపేందుకే రాష్ట్రీయ స్వయం సేవా సంఘాన్ని మన పెద్దలు స్థాపించడం జరిగిందన్నారు. హిందూ ధర్మం అందరికీ సమానమే అన్నారు. కులాలకు మతాలకు ప్రాంతాలకు తేడా లేకుండా మనమందరం ఒకటే అనే నినాదాన్ని తెలిపేదే రాష్ట్రీయ స్వయం సేవా సంఘం అన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి ఇతర రాష్ట్రాల్లో ఇతర వ్యక్తులు అవహేళన చేసి మాట్లాడినప్పుడు రాఘవేంద్ర మఠం తరపున మాధ్యమాలలో ఖండించడం జరిగిందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఏరాజకీయపార్టీ కాదని , అలాగే దేశాన్ని విచ్చినం చేసే సంఘ విద్రవ శక్తి కూడా కాదన్నారు. హిందువులందరూ ఏకమై ధర్మాన్ని కాపాడుకుంటూ భావితరాలకు మార్గదర్శకగా నిలవాలన్నారు. సనాతన ధర్మాన్ని తెలిపేందుకు ప్రతి ఆదివారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని , రాష్ట్రీయ స్వయం సేవా సంఘానికి తెలియ ఆ కార్యక్రమానికి ముఖ్య వక్త ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ద్భావన ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ హాజరై హిందూ ధర్మ పరిరక్షణ పై విశిష్ట ఉద్ఘాటన చేశారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాస్ రావు, సర్పంచ్ భీమయ్య, హిందూ సమ్మేళన సమితి సభ్యులు రాఘవేంద్ర, శాంతయ్య, శివ, హనుమంతు, కురువ మల్లికార్జున తదితర ఆర్ ఎస్ ఎస్ సభ్యులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

