మహానంది మండలంలో ఏసీబీ ఆరా…
1 min read

మహానంది , న్యూస్ నేడు: మహానంది మండలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఏసీబీ అధికారులు పలు అంశాలపై ఆరా తీసినట్లు విశ్వాసనీయ సమాచారం. మండలంలోని ఒక గ్రామంలో ఒక కేసు విచారణ సందర్భంగా పలు అంశాలపై, పలువురి అధికారులపై రహస్య విచారణ చేసినట్లు తెలుస్తుంది. మహానంది, బండి ఆత్మకూరు, రుద్రవరం, ఆళ్లగడ్డ, సిరివెళ్ల ,నంద్యాల తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారుల పనితీరు, మధ్యవర్తుల వివరాలు కోసం ఇన్ఫార్మర్ల ద్వారా రహస్యంగా ఆధారాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.

