NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు రుణాలు విరివిగా మంజూరు చేయండి

1 min read

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అమలుకు వీలుగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: రైతులకు ఆదాయం పెరిగే విధంగా పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు రుణాలు విరివిగా మంజూరు చేయాలని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అమలుకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి  బ్యాంకర్లకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్ ల కు సంబంధించిన రెండవ త్రైమాసిక డి సి సి, డి ఎల్ ఆర్ సి  సమావేశాన్ని  జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి ముఖ్యంగా లైవ్ స్టాక్ సంబంధిత రుణాలను—అనిమల్ హస్బండ్రీ, ఫిషరీస్, పౌల్ట్రీ తదితర రంగాలకు—బ్యాంకులు విస్తృతంగా ఇవ్వాలని సూచించారు. రైతుల ఆదాయం పెరగడానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చైతన్యవంతం కావడానికి ఈ రుణాలు కీలకమని ఆమె పేర్కొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమానికి  బ్యాంకర్లను కూడా ఆహ్వానించి, రైతుల సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ నవీన్ కుమార్, కేడీసీసీ సీఈఓ రామాంజనేయులు, CB RSETI డైరెక్టర్ పుష్ప కుమార్ అన్ని బ్యాంకుల జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author