విద్యార్థి దశ నుండే నూతన ఆవిష్కరణ లవైపు దృష్టి సారించాలి
1 min read

భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలో మంచి ఫలితాలు సాధించవచ్చు
ఆర్టీసీ విజయవాడ జోనల్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
సన్ సైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విద్యార్థి దశనుండే నూతన ఆవిష్కరణల వైపు దృష్టి, సారిస్తే భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక అవిష్కరణలలో మంచి ఫలితాలు సాధించవచ్చని, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక వెన్నవల్లి వారి పేట సన్ సైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మన దేశం మరింతగా ముందుకు దూసుకుపోతుంది అని, అందుకు తగి నట్లుగా విద్యార్థిని విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకొని నూతన ఆవిష్కరణలు రూపకల్పన చేయాలన్నారు.మరో ముఖ్య అతిథి మహిళా శిశు సంక్షేమ శాఖ నోడల్ ఆఫీసర్ ఈ తులసి మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి ఎగ్జిబిషన్లు ద్వారా మరింత విజ్ఞానం పెంచుకొని చదువులో ముందుకు దూసుకు పోవటం తో పాటు, సరికొత్త ప్రయోగాల వైపు దృష్టిసారించి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. స్కూల్ కరస్పాండెంట్ శేఖర్ వచ్చిన అతిథులందరికీ సైన్స్ డే యొక్క ప్రాధాన్యత వివరిస్తూ, గతంలో శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు చేసిన ఎన్నో విషయాలను దృశ్య రూపంలో వివరించారు. అనంతరం అతిధులను సత్కరించి మెమింటోలను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మరియు స్టేట్ అక్రిడేషన్ కమిటీ మెంబర్ డి.ఉదయభాస్కర్, ఇతర పాఠశాల ప్రధానోపాధ్యాయులు సన్ సైన్ స్కూల్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు.


