NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ముగిసిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

1 min read

శ్రీమతి వైకుంఠం జ్యోతి నేతృత్వంలో ఆలూరు మండలంలో వైభవంగా నిర్వహణ – భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

ఆలూరు న్యూస్ నేడు : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ యోధుడు డా. బి.ఆర్. అంబేద్కర్  135వ జయంతి వేడుకలు ఆలూరు మండలంలో అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి  నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానుల విశేష స్పందనతో వైభవంగా ముగిసింది.ఈ సందర్భంగా  వైకుంఠం జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్  సేవలను, ఆయన సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రత్యేకంగా ప్రసంగించారు.ఆమె మాట్లాడుతూ, “డా. బి.ఆర్. అంబేద్కర్  చూపించిన మార్గం సమాజానికి దిశానిర్దేశం చేసిన మహత్తరమైనది. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగుతాం” అని పేర్కొన్నారు.కార్యక్రమానికి మండల నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. సభా ప్రాంగణం నినాదాలతో మారుమోగగా, అంబేద్కర్  ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ వేడుకలను ఘన విజయంగా నిలిపిన ప్రతి ఒక్క పార్టీ సైనికుడికి, నాయకులకు, అభిమానులకు శ్రీమతి వైకుంఠం జ్యోతి  పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“ఈ విజయానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా సేవలో ఇదే ఐకమత్యంతో ముందుకు సాగుదాం” అని ఆమె అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *