NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీ కోసం కష్టపడే వారికి అండగా వుంటాం: మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వంలో కష్టపడే వారికి పార్టీ అండగా ఉంటుందని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలంలోని వెంగళాంపల్లె గ్రామానికి చెందిన నారాయణ స్వామి సుంకులమ్మ దేవర నిర్వహించారు. ఆయన ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కు మాజీ సర్పంచ్ జయశీలమ్మ, శంకర్, రాంబాబు, నారాయణ స్వామి ఘన స్వాగతం పలుకుతు ఆహ్వానించారు.నారాయణస్వామి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరై వెంగళాంపల్లె గ్రామ శివారులో వెలిసిన శ్రీ సుంకులమ్మ అమ్మ వారికి  ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి తిసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ గ్రామ దేవతలను మనం మారకుండా పూజించడం వలన పాడిపంటలు కొలువు తీరుతాయి అలాగే గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆమె తెలిపారు. వెంగళంపల్లెలో గతంలో కీర్తిశేషులు శేషయ్య గ్రామానికి ఎనలేని సేవలు చేసి ప్రజలకు ఆపద్బాంధవుడు నిలిచారని ఆయనను గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన సతీమణి మాజీ  సర్పంచ్ జయశీలమ్మను కూడా గ్రామ ప్రజలు ఆదరించి ఆమె సేవలను గ్రామానికి ఎంతో అభివృద్ధికి కృషి చేస్తారని వారిని మరవకూడ ఆదరించాలని గ్రామ ప్రజలకు కోట్ల సుజాతమ్మ తెలిపారు.

About Author