NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం ఎమ్ ఈ ఒ పై విచారణ జరిగింది కానీ చర్యలు ఎక్కడ..?

1 min read

స్లెట్, జీనియస్ గ్లోబల్ స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలి

ఆర్ యూ ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:   మంత్రాలయం ఎమ్ఈఒ మొయినుద్దీన్ పై విచారణ జరిగి వారాలు  గడుస్తున్న జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథ్ ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది ఆరోపించారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ వెయిట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న  మంత్రాలయం మండల విద్యాధికారి మొయినుద్దీన్ ను సస్పెండ్ చేయాలని గత కొన్ని వారాల క్రితం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి డిప్యూటీ ఆదోని డీఈవో. గారిని విచారణ కమిటీ అధికారిగా నియమించడం జరిగింది ఆయన కొన్ని వారాలకు ఎంఈఓ పైన విచారణ జరిపి స్లెట్, జీనియస్ గ్లోబల్ పాఠశాలను సందర్శించి అక్కడ ఉండేటటువంటి సమస్యలను గురించి విచారణ కమిటీ తరఫున డిఈఓ గారికి అందజేస్తామని వారు హామీ ఇచ్చారు విచారణ జరిగి వారాలు గడుస్తున్న కూడా పై జిల్లా విద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం దారుణమని విద్యార్థులు భవిష్యత్తు ఆలోచించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాడమాడుతున్నటువంటి ఏంఈఓ ని సస్పెండ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న విద్యాధికారులు సిగ్గుచేటు అని అదేవిధంగా సరైన వసతులు లేకుండా ఎంఈఓ ఎలా పర్మిషన్లు ఇచ్చారు అని తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా జిల్లా విద్యాధికారులు స్పందించి ఎంఈఓ మొయినిద్దీన్  సస్పెండ్ చేసి సరైన వసతులు లేనటువంటి స్లేట్  జీనియస్ గ్లోబల్ పాఠశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని  వారు హెచ్చరించారు.

About Author