NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12 కిలోమీటర్ల రోడ్డును వెయ్యకపోతే ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం

1 min read

సిపిఎం నాయకులు హెచ్చరిక.

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:    ఎమ్మిగనూరు పట్టణంలో అటుగా వచ్చిన ఎమ్మినూరు ఎమ్మెల్యే నాగేశ్వర్రెడ్డిని నిలదీసిన సిపిఎం నాయకులు. ఎమ్మిగనూరు నుండి  కమ్మలదిన్నె వరకు 12 కిలోమీటర్ల రోడ్డును తక్షణం వెయ్యకపోతే ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ హెచ్చరించారు. ఈరోజు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ కమిటి దగ్గర ఎమ్మిగనూరు నుండి  కమ్మలదిన్నె వరకు 12 కిలోమీటర్లు తక్షణమే వేయాలని కోరుతూ  సిపిఎం ఎమ్మిగనూరు పెద్దకడబూరు ప్రాంతీయ కమీటిల ఆధ్వర్యంలో రాస్తారో పెద్ద ఎత్తున  నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా సిపిఎం ఎమ్మిగనూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి సి గోవిందు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి  కమ్మలదిన్నె వరకు 12 కిలోమీటర్లు ఉన్నదని, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేసిన రోడ్డేనని ఆ తరువాత అధికారంలోకి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు గాని ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రజాజప్రతినిధులు గాని పట్టించుకున్న పరిస్థితి లేదని ఆయన విమర్శించాడు.  కనీసం అటువైపు కన్నెత్తని కూడా చూడకుండా ఉండే ప్రజాప్రతితులు ఈ ప్రాంతంలో ఎన్నిక కావడం ఈ ప్రాంత ప్రజల దౌర్భాగ్యమనీ  ఆయన ఘాటుగా విమర్శించారు. గత 15 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ప్రజలు ప్రయాణం చేయడానికి అనేక అవస్థలు పడుతున్న వారి గోడు వినే నాథుడే లేడని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఇలాంటి అధికారులు, ఏ మాత్రం చలనం లేని ప్రజాప్రతినిధులు ఉండడం  ఈ ప్రాంతంలో ఉండడం ప్రజలు చేసుకున్న పాపమని ఆయన తెలిపారు. 12 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే కనీసం గంట అవుతుందని, గర్భవతులు వృద్ధులు ఈ రోడ్డు పై ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఉన్నదని, అనారోగ్యాలకు పాలవుతామనీ అటు పెద్దకడబురు ఇటు మంత్రాలయం వైపు వెళ్లి వస్తున్నారు అని ఆయన తెలిపారు. వర్షాకాలం వస్తే మోటార్ బైకులు పోవాలన్నా  సాధ్యం కాని పరిస్థితి ఉన్నదని తెలిపారు. రైతులు తమ పంట పొలాలకు కావాల్సిన  ఎరువులు గాని పండించిన పండించిన  పంటను కానీ తీసుకొని వెళ్లే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు వేయడానికి పునుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాస్తా రోకో చేస్తున్న సందర్బంగా అటువైపు వచ్చిన ఎమ్మిగనూరు శాసనసభ్యులు జై నాగేశ్వర్ రెడ్డిని సిపిఎం నాయకులు కార్యకర్తలు అడ్డుకునీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్షణమే రోడ్డు వేయడం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ పెద్దకడుబూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఈ తిక్కన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున  ఉద్యమాన్నిచే పడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు కెవిపిఎస్ మండల కార్యదర్శి దేవదాసు, సిఐటియు నాయకులు బసవరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు శ్రీనివాసులు, డివైఎఫ్ఐ నాయకులు రాజేంద్ర, ఎమ్మిగనూరు రైతు సంఘం నాయకులు లక్ష్మీనరసయ్య, అబ్దుల్లా, నరసింహులు, సిపిఎం నాయకులు రమేష్, తిమ్మప్ప, వలి, కెవిపిఎస్ నాయకులు సుమాల అంతోని, గుంటప్ప పాల్గొన్నారు.

About Author