కేవలం ఒక్క రూపాయికే బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ ఉచితం
1 min read

ఫైబర్ టీవీ కేవలం 400/- రూపాయలకే
ఐ టి ఎస్ నూతనంగా ప్రారంభించిన ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను
ఏలూరు, న్యూస్ నేడు: కేవలం ఒక్క రూపాయికే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జి సి ఉచితంగా అందించబడుతుందని శనివారం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను ఐ.టి.ఎస్ కొత్తగా ప్రారంభించిన ఫైబర్ టీవీ కేవలం 400/- రూపాయలకే అంటే 260/-రూపాయలు ఇంటర్నెట్ మరియు కాల్స్ ప్లస్ 140/- రూపాయలుతో 400 చానల్స్ మరియు తొమ్మిది ఓ టి టి చానల్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. మరియు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బి.ఎస్.ఎస్.ఎల్ 4G సిమ్ ఉచితం, కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల కాల వ్యవధితో అద్భుతమైన కొత్త ఫ్రీడం ప్లాన్ ను అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా మరియు 100 ఎస్ఎంఎస్ లు తో ప్రవేశపెట్టిందని వివరించారు.ఈ ప్లాన్ పోర్టబిలిటీలు (ఎం ఎం పి) కూడా వర్తిస్తుందని అన్నారు. ఈ ప్లాన్ ది.31-08-2025 వరకు మాత్రమే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారులు వినియోగించుకోవాలని అన్నారు, ఇప్పటికే అందుబాటులో ఉన్న 4G మొబైల్ సర్వీసింగ్ వినియోగదారులందరూ విరివిగా వినియోగించుకోవాలని మరియు రానున్న రోజుల్లో మారుమూల గ్రామాల్లో, 4G టవర్లు రానున్నవి అని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను, ఐ టి ఎస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె ఎస్ వి జి సోమయాజులు, ఐ ఎఫ్ ఏ కె సూర్యచంద్రరావు, పి ఆర్ ఓ వై మోహన కృష్ణ, బిఎస్ఎన్ఎల్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.


