NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హక్కుల సాధనకై కథం తొక్కిన అంగన్వాడీలు 

1 min read

నాలుగు స్తంభాల కూడలి దగ్గర మానవహారం నిర్వహించిన అంగన్వాడీలు 

దీక్షలకు మద్దతు తెలిపిన గ్రామపంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక 

ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా అధికారికి వినతి పత్రం అందించిన అంగన్వాడీలు 

న్యూస్ నేడు, పత్తికొండ: అంగన్వాడీలు తమ హక్కుల సాధన కోసం కదం తొక్కారు. తమ సమస్యల పరిష్కారం కోసం పత్తికొండ పట్టణంలోని స్థానిక కోరమండల్ ముందు నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు చిట్టెమ్మ సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర అధ్యక్షతన వహించారు. ఐదవ రోజు దీక్షలో గ్రామ సర్పంచ్ కొమ్ము దీపిక మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 42 రోజులు దీక్ష లు చేపట్టినప్పటికీ అంగన్వాడీల కోరికలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వంలో కూడా మరి దారుణంగా ఉందని అంగన్వాడీలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు దస్తగిరి సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర ఏ డబ్ల్యు డబ్ల్యు ప్రాజెక్టు పద్మజ మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీలకు ఉద్యమాలు కొత్తేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి, నేటి క్యాన్లతో కొట్టించిన పోలీసుల లాఠీ చార్జీలు చేసిన ఆ అసెంబ్లీ ముట్టడిలో కమ్యూనిస్టు నాయకులు పశువులు బాసిన వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా 42 రోజులు దీక్షలు చేపడితే అప్పటి ముఖ్య మంత్రి ఎస్మా ప్రయోగించి బెదిరింపులు చేసిన వెనక్కి తగ్గలేదని ఇది చంద్రబాబు నాయుడు మననం చేసుకోవాలి.

About Author