ఎన్‌సీసీ 28 వ పటాలపు వార్షిక పరిశీలన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (DDG) ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ కర్నూలు ఎన్సిసి 28 వ పటాలపు వార్షిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నరూ. కార్యాలయ పరిపాలన సమచారంనీ పరిశీలించిన్నారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు గ్రూపు తల్ సైనిక్ శిక్షణా శిబిరంలో మంచిగా శ్రమించి ఎన్సిసి విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. కర్నూలు గ్రూపు వారీ శిక్షణ వలన ఎన్సిసి విద్యార్థులు జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొని ఆంధ్ర మరియు తెలంగాణ ఎన్సిసి గౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చారు, దీనికి ప్రధాన కారణం కర్నూలు గ్రూపు అధికారులు మరియు శిక్షణ సిబ్బంది. వారికి నా ప్రత్యేక అభినందనలు, చాలా సంతోషంగా ఉందని తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కర్నూలు గ్రూపు ప్రధాన అధికారి కల్నల్ అలోక్ త్రిపాటి , పరిపాలన అధికారి శశి కుమార్ , కార్యాలయ పర్యవేక్షకులు జి . కృపా సాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


