ఏపీ వెయిట్ లిఫ్టింగ్ (ఇంటర్- డిస్టిక్) చాంపియన్స్ 2025
1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక ఇండోర్ స్టేడియం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ (ఇంటర్- డిస్టిక్) అండర్ 14 గర్ల్స్ చాంపియన్స్ 2025 పోటీలు సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరయ్యారు. క్రీడలు యువతీ యువకులు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక, శారీరక ఎదుగుదలకు మంచి ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. విజయం అందుకున్న క్రీడాకారులకు మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,ఇడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకట రామయ్య, ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ టి.దిన్షా బాబు, పశ్చిమగోదావరి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ కే.సర్వేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.


