NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తగ్గిన జీఎస్టీ పై పొదుపు సంఘాలకు అవగాహన

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై అవగాహన కార్యక్రమాన్ని మహానంది మండల ఏపీఎం తిరుపాల్ రెడ్డి బుక్కాపురంలో నిర్వహించారు. మండల సమాఖ్య కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొదుపు మహిళలకు జీఎస్టీ వల్ల 18% నుండి 5% వరకు వివిధ రకాల వస్తువులపై ధరలు తగ్గిన విషయాన్ని వివరించారు. దీనివల్ల వినియోగదారులకు లబ్ధి చేకూర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయంలో కొంత కోల్పోవాల్సి వస్తుందని అయినా కూడా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ని తగ్గించి పేద మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచిందన్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు కొనుగోలు సామర్థ్యం పెరిగినట్లు అవుతుందని ఏపిఎం తిరుపాల్ రెడ్డి పొదుపు మహిళా సంఘాలకు తెలియజేశారు. దీనిని మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో ఉన్న మహిళలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన మహిళా సంఘాల కు చెందిన మహిళలు పాల్గొన్నారు.

About Author