NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతికి దరఖాస్తులు

1 min read

ఎంఈవో లు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్..

మిడుతూరు , న్యూస నేడు:  ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో ఉచిత  ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నంద్యాల జిల్లా మిడుతూరు మండల విద్యాశాఖ అధికారులు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్ శనివారం అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటవ తరగతి ప్రవేశం కొరకు ఫిబ్రవరి 20 నుండి మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులుcse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా విద్యార్థుల వివరాలను ఆన్ లైన్ చేయాలన్నారు.మొదటి విడత మార్చి 25వ తేదీ.. రెండవ విడతలో ఏప్రిల్ 12వ తేదీన లాటరీ ద్వారా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారని ఎంఈఓ లు తెలిపారు.ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు గమనించాలని అన్నారు.

About Author