36 లక్షలతో ఆరోగ్య కేంద్రం మంజూరు
1 min read

ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసిన తెదేపా నాయకులు
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో నూతనంగా మంజూరైన గ్రామ ఆరోగ్య కేంద్రానికి గ్రామ టిడిపి నాయకులు భూమి పూజ చేశారు.36 లక్షల కేంద్రం నిధులతో మంజూరైన ఆరోగ్య కేంద్రానికి శనివారం ఉదయం గ్రామ తెదేపా నాయకులు ఆర్ సోమ సుందర్ రెడ్డి,ఈ రామేశ్వర్ రెడ్డి,డి జయరాముడు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఆరోగ్య కేంద్రం మరియు స్మశాన వాటికకు వెళ్లే సిమెంట్ రహదారి నిర్మాణానికి గాను సహకరించిన పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యేక చొరవతో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత దగ్గరగా అందుబాటులోకి రానున్నాయని గ్రామ అభివృద్దే ద్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మీనిగ మహేశ్వర రెడ్డి,కుంచె పుల్లారెడ్డి,మహేశ్వర రెడ్డి, పాపిరెడ్డి రాజేశ్వర రెడ్డి,దేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,ప్రభాకర రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,విష్ణువర్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

