రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ‘జలోత్సవ్
1 min read

వాటర్: ది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్’ అంతర్ పాఠశాల మహోత్సవం
కర్నూలు, న్యూస్ నేడు: రిడ్జ్ స్కూల్‌లో తొలిసారిగా నిర్వహించిన అంతర్ పాఠశాల కార్యక్రమం ‘జలోత్సవ్ – వాటర్: ది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్’ ఘనంగా జరిగింది. ఈ విశిష్ట కార్యక్రమం విద్యార్థుల్లో నీటి ప్రాధాన్యత, స్థిరత్వం సృజనాత్మకత మరియు బాధ్యతాయుత పౌరసత్వం పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.ప్రస్తుత కాలంలో నీటి వనరుల పరిరక్షణ అత్యంత అవసరమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో రిడ్జ్ స్కూల్ చేపట్టిన ఈ కార్యక్రమం సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించింది. వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ జలోత్సవ్‌లో భాగంగా చిత్రలేఖనం, వాదవివాదం, మైమ్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ప్రతి కార్యక్రమం నీటి సంరక్షణ, వర్షజల సంగ్రహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కేంద్రీకృతమై ఉండటం విశేషం.విద్యార్థులు నీటి విలువను తెలియజేస్తూ సృజనాత్మక ఆలోచనలు, వినూత్న ప్రదర్శనలు అందించారు. “నీరు జీవనామృతం” అనే భావనను ప్రతీ విద్యార్థి తన ప్రదర్శన ద్వారా ప్రతిఫలింపజేశాడు. ప్రిన్సిపల్ శ్రీమతి రాజ్ కమల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచిందని ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి అనేక విషయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా అడుగులు వేయడానికి రిడ్జ్ పాఠశాల ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.


