NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంధర్బంగా కట్టుదిట్టమైన గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని  ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్  తెలిపారు.జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్  గురువారం ఉదయం నిర్వహించారు.  కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్  ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ కు  ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్  హాజరై  పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ…స్వాతంత్ర్య వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్న సంధర్బంగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా ను పటిష్టం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో  ఎఆర్ డిఎస్పీ భాస్కర్ రావు, ఆర్ ఐలు , ఆర్ ఎస్సైలు,  సివిల్ , ఏ ఆర్ పోలీసు, హోంగార్డ్సు , స్కౌట్ విద్యార్దులు  , రెడ్ క్రాస్, సీనియర్  సిటిజన్స్, ఎన్ సి సి విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author