NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు..

1 min read

శివరాత్రి రోజు సుమారు 1,50,000 పైన భక్తులు వస్తారని అంచనా

భక్తులకు సౌకర్యాలతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది

కర్నూలు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు జరుగుచున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఇలాంటి సౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేయడంతో పాటు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిన్నటి దినం అనగా 11 తేదీ బుధవారం సుమారు 63,596 మంది భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది .వీరిలో 14,803 మంది శివ భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్పర్శ దర్శనం చేయడం జరిగింది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 30,149 మంది దర్శనం చేసుకోగా వారిలో 11,515 మంది శివ భక్తులు ఉన్నారు.నిన్నటి దినం కైలాస ద్వారం నుండి సుమారుగా 26,000 మందికి పైగా భక్తులు కాలినడకన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి రావడం జరిగిందని వారికి అసౌకర్యం లేకుండా వైద్య సేవలతో పాటు ఆహారము నీళ్లు మొదలగు సౌకర్యాలు కల్పించడం జరిగింది. శివరాత్రి పర్వదినం రోజున అనగా 15 వ తేదీన సుమారు 1,50,000 మంది కన్నా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని వారికి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా సరిపడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.స్నానఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు బోట్లను గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్సులకు మరియు కార్లకు రింగ్ రోడ్డు వద్ద ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ వాహనాలను పోలీసు వారి సూచనలతో పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలుపుకోవాలని రోడ్డుకు ఇరువైపులా ఎట్టిపరిస్థితులలో వాహనాలు నిలుపరాదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

About Author