పత్తికొండ సాయి బాబా మందిరంలో ఘనంగా అష్టావధానం
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ : స్థానిక పత్తికొండ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో రామచంద్రారెడ్డి మరియు నాగరత్నమ్మ గార్ల సౌజన్యంతో సవ్వ ప్ప ఈరన్న స్థాపించిన కమలా కళానికేతన్ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 40వ అష్టావధానము నిర్వహించారు. శతావధాని శ్రీ ఉప్పల దడియం భరత్ శర్మ రిచే అవధానం చేశారు. సభా ప్రారంభానికి ముందు మాజీ మండల ప్రసిడెంట్ శ్రీమతి నాగరత్నం జ్యోతి ప్రజ్వలన చేయగా, జనప్రియ కవి శ్రీ ఏలూరి వెంకన్న కవి అధ్యక్షతన సాహితీ సభ జరిగింది. మొదట సవ్వప్ప ఈరన్న రచించిన 74 వ పుస్తకం “విద్యార్థి శతకము” పుస్తకావిష్కరణ గావించారు.” పుస్తకావిష్కరణ అనంతరం శతావధానిశ్రీ ఉప్పల దడియం శరత్ శర్మ అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమంలో సన్మానకర్త ఎస్ నాగరత్నం , ముఖ్య అతిథిగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శిశ్రీ కొత్తపల్లి సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. పృచ్ఛక వర్గముగా గంగాధర్ ,ఓంకార్, ఆవుల బసప్ప ,రాజేష్ ,షేక్ సద్దం హుస్సేన్ ,రామకృష్ణ ,శ్రీకృష్ణ, నక్కిరి భాస్కర్ ,పాల్గొనడం జరిగింది . ఇదే కార్యక్రమంలో జానపద కళాకారులైన మొలగవల్లి కొట్టాల మహిళలను కమలా కళానికేతన్ ఆధ్వర్యంలో నాగరత్నమ్మ ఘనంగా సన్మానించడం జరిగింది.


