NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిశ్రమల ఏర్పాటుకు మరింత ప్రోత్సహించాలి

1 min read

పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలి

జిల్లా సమగ్ర అభివృద్ధికి నూతన పెట్టుబడి దారులను ఆకర్షించేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి లక్ష్యాలను అధిగమించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక  కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, సంబంధిత శాఖల అధికారులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి  జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి నిర్ణీత సమయంకంటే ముందుగానే  అనుమతులు మంజూరు చేసి, ప్రతి యూనిట్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు రాయితీపై సమీక్షించి  ఎంఎస్ఎంఈ   పరిశ్రమలు పెట్టుబడి రాయితీ  ఆరు యూనిట్లకు రూ 2 కోట్ల 40 లక్షల 87 వేలు, పవర్ సబ్సిడీ  12 యూనిట్లకు రూ 1 కోటి 13 లక్షల 77 వేలు, వడ్డీ రాయితీ 11 యూనిట్లకు రూ 55 లక్షలు 23 వేలు, స్టాంపు డ్యూటీ సబ్సిడీ ఒక యూనిట్ కు రూ 70 వేలు  మంజూరు చేసామని తెలిపారు. ఋణాలు మంజూరులో ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రుణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకట రావు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, జిల్లా పరిశ్రమలు తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి, డిఆర్డిఏ పిడి టి.వి.విజయ లక్ష్మి, జిల్లా పంచాయతీశాఖ అధికారి కె.అనురాధ, జిల్లా స్కిల్  డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్రబాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, యల్డియం డి.నీలాద్రి, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author