17న బుగ్గ రామేశ్వర స్వామి రథోత్సవం
1 min read

భక్తులకు తగిన రీతిలో ఏర్పాట్లు
ఈనెల 14 నుండి 19 వరకు బ్రహ్మోత్సవాలు
ఆలయ ఈవో మద్దిలేటి.. చైర్మన్ నారాయణ
ఓర్వకల్లు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి రథోత్సవం ఈనెల 17వ తేదీన సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మద్దిలేటి మరియు ఆలయ చైర్మన్ నారాయణ తెలిపారు. ఈనెల 14 నుండి 19 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు.ఈ బ్రహ్మోత్సవాలకు గాను దేవాలయాన్ని ప్రత్యేకంగా రంగులతో మరియు లైట్లతో ఆలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు.
భక్తులకు తగిన రీతిలో ఏర్పాట్లు:ఈవోభక్తులు అధిక సంఖ్యలో వస్తున్న తరుణంలో వారిని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా తగిన రీతిలో ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి మద్దిలేటి అన్నారు. భక్తులకు త్రాగునీరు,చలువ పందిళ్లు,కోనేరు వద్ద స్నానపు గదులు,వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని అన్నారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆలయ చైర్మన్
14 నుండి ప్రారంభం అయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ నారాయణ అన్నారు.దేవాలయం మరియు పరిసర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.


