హొళగుందలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులపై దాడులను అరికట్టాలి
1 min read

పారిశుద్ధ్య కార్మికులు అంటే ఎందుకంత లోకువ
పారిశుద్ధ్య కార్మికులు వారి ఇంట్లో గాసగాళ్లు కాదు
దళితులైన పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద గ్రామంలోని కాలనీలు వీధులలో పారిశుద్ధ్య పనులు చేస్తూ చెత్తను ఎరువేస్తూ మురుగు కాలువలు శుభ్రపరుస్తూ తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి అధికారుల ఆదేశాలను పాటిస్తూ చెత్త చెదారం ఇతర వ్యర్థాలను తొలగించి గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీలను శుభ్రంగా ఉంచడానికి నిరంతరం పనిచేస్తున్న హొళగుంద గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అంటే కొంతమంది వ్యక్తులకు చిన్న చూపుగా చులకన భావంగా ఉందని, తామేదో మహారాజులు, జామిందార్ల మాదిరి బావించుకుంటూ గ్రామంలోని కాలనీలలో పని చేయడానికి వచ్చిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను అసభ్య పదజాలంతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం దూషించడం చేస్తున్నారని ,హొళగుంద గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక ఆరవ వార్డు ఈ బీసీ కాలనీలో చెత్త సేకరణకు వెళ్లి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము చేస్తున్న పనిని వీడియో తీస్తూ జిపిఎస్ నమోదు చేస్తున్న గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ క్లాప్ మిత్ర కార్మికుని పై హొళగుంద గ్రామానికి చెందిన జాడర మల్లికార్జున అనే వ్యక్తి అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడుతూ చెత్త సేకరణ చేయకుండా విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులపై దౌర్జన్యాలు జరిగాయని కేవలం పారిశుద్ధ కార్మికులు దళితులు అనే చిన్న చూపుతో అసభ్య పదజాలంతో మాట్లాడడం దౌర్జన్యానికి పాల్పడం జరుగుతోందని దళితుల హక్కులకు భంగం కలిగించే ఇటువంటి వాటిని సహించబోమని దళితులైన పారిశుద్ధ్య కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తామని, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులపై అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కలిగించిన జాడర మల్లికార్జున పై అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించి బాధితులకు న్యాయం జరిగే వరకూ వరకు పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ముత్తయ్య, గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

