అట్టహాసంగా మండల స్థాయి పోటీలు..
1 min read

విజేత విద్యార్థులకు మెమెంటోలు అందజేత..
మిడుతూరు , న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మండల స్థాయి ఆటల పోటీలు గురువారం జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగాయి.జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ తెలిపారు.ముందుగా పోటీలను ఎంపీడీఓ పి దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి మండల స్థాయి అండర్-14 మరియు అండర్-17 బాల, బాలికల ఎస్ జిఎఫ్ కబడ్డీ,ఖోఖో,షటిల్ బ్యాడ్మింటన్,యోగా, చెస్,అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటల పోటీల్లో గెలుపు ఓటమి సహజం విద్యతో పాటు పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరచాలని వారు అన్నారు.ఈ పోటీల్లో బాల,బాలికలు కలిపి 16 జట్లు పాల్గొనగా వంద మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు.గెలుపొందిన విజేతల వివరాలు: కబడ్డీ బాలురు:జడ్పీహెచ్ఎస్ మిడుతూరు,కడుమూరు, తదితర ఆటల పోటీల్లో కలమందల పాడు,వీపనగండ్ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.వీరందరికీ అధికారులు మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలోజిల్లా పరిషత్ హెచ్ఎం సాయి తిమ్మయ్య,నరసింహ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్లు చక్రపాణి, వెంకటకృష్ణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

