25 కోట్ల వ్యయంతో ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికరణ
1 min read

రైల్వే ఏడిఆర్ఎం పి.ఈ. ఎడ్విన్
ఏలూరుజిల్లా ప్రతినిధి ,న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల ఆధునీకరణంలో భాగంగా ఏలూరు రైల్వే స్టేషన్ ను అత్యంత ఆధునీకరణంగా తయారు చేసేటందుకు 25 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని విజయవాడ ఏడిఆర్ఎం పి.ఈ. ఎడ్విన్ తెలిపారు. స్థానిక ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో ఏర్పాటుచేసిన అమృత్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రైల్వే శాఖకు నూతనంగా ఎంపిక కాబడిన రైల్వే అడ్వైజరి కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించి వారి యొక్క సలహా సూచనలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో అదనంగా వృద్ధులకు వికలాంగులకు ఉపయోగపడేలా అదనంగా మరొక మూడు లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటితో పాటు వెస్క్వేటర్లు మూడిటినీ కూడా ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్న అన్నారు. అంతేకాకుండా ప్రీమియం టాయిలెట్లు, విశ్రాంతి గదులు కూడా నూతనంగా నిర్మిస్తున్నామని ఎడ్మిన్ తెలిపారు. 2047 నాటికి రైల్వేస్టేషన్లో అన్ని ఆధునీకరణతో, అన్ని సౌకర్యాలతో తయారు చేసేటందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలను చేపట్టిందని, ఈ కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన ఈ సందర్భంగా ప్రయాణికులను కోరారు. ఉభయగోదావరి జిల్లాల జెడ్ ఆర్ విసి సభ్యులు రవి అగర్వాల్ ఏడిఆర్ఎం కు వందే భారత్ రైలును ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో మరింత ఆగే సమయాన్ని మరికొంత సేపు నిలుపుదల చేయాలని కోరారు. అమృత్ సంవాద్ కార్యక్రమంలో ప్రజలను వారి యొక్క సలహా, సూచనలు ఇవ్వాలని ఏడిఆర్ఎం కోరగా ఏలూరు కి చెందిన సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో ప్రయాణించే మధ్య తరగతి వారు ప్రయాణ సంఖ్య పెరగడంతో రద్దీ ఎక్కువై ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లలో జనరల్ బోగీలను మరిన్ని పెంచవలసిన అవసరం ఉందని సూచన చేశారు. అందుకు స్పందించిన ఏడిఆర్ఎం ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నత అధికారులకు తెలియజేశామని ఆ ప్రతిపాదనలు త్వరలోనే అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పలువురు ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు మరికొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రైల్వే స్టేషన్ సలహా సంఘ సభ్యులు నిమ్మ కూరి కిరణ్ కుమార్, కె.నారాయణ,రైల్వే అధికారి భగవాన్ నాయక్, ఏలూరు కన్ఫ్లేట్ టీం సభ్యులు పాల్గొన్నారు.


