NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చెయ్యాలి

1 min read

గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారథి

మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాలు ప్రజలకు,రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుని అమలు చెయ్యాలని,

రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించుటకు అధికార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని

ఏలూరు, న్యూస్​ నేడు:  సర్వసభ్య సమావేశానికి మండల పరిషత్తు అధ్యక్షులు కొండా దుర్గా భవాని అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముసునూరు యంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు కొండా దుర్గా భవాని అధ్యక్షత వహించగా, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 22 శాఖలు అధికారులు శాఖలు వారీగా ప్రగతిని వివరించారు. మండలంలో రూ 41.20 కోట్లుతో అభివృద్ధి పనులు, అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను యంపిడివో  వివరించారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని, ముఖ్యముగా స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చెయ్యక, అభివృద్ధి, సంక్షేమ పథకాలు కుంటుబడ్డాయని అన్నారు. ఒక సంవత్సరంలోనే మండలంలో రూ 41.20 కోట్లుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు అయ్యాయని, కొన్ని పూర్తయి, కొన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. మండలంలో 6 వేలు ఎకరాలు భూమి నిరుపయోగంగా ఉందని ఆ భూమిని సాగులోకి తెచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలంలో 350 విద్యుత్తు ట్రాన్స్ఫర్లు అవసరం ఉండగా 10 రోజుల్లో 150 ట్రాన్స్ఫర్లను తెప్పించి ప్రయారిటీ ప్రకారం, పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు అమర్చుచున్నామని తెలిపారు. మిగతా ట్రాన్స్ఫర్లు కూడా తెప్పించి ఎక్కడ కూడా లోవోల్టేజి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి చెయ్యిదాటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు.ఈ సమావేశంలో యంపిడివో పి.ఏసుబాబు, ఈవోపీఆర్డి బి.ఏ.సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దారు జి.పి.శర్మ, వివిధ శాఖలు అధికారులు,జడ్పీటీసీ సభ్యులు వరికూటి ప్రతాప్, యంపిటిసిలు,కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ సర్పంచులు, యంపిడివో కార్యాలయం ఉద్యోగులు,కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

About Author