సేవకు..పురస్కారం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలను కర్నూలు పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో సోమవరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ డా.ఏ.సిరి ఎగరవేశారు. అనంతరం దేశానికి, ప్రజలకు, సమాజానికి సేవ చేసిన స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులకు, ఉద్యోగులకు, సామాజిక సేవా కార్యకర్తలను కలెక్టర్ డా.ఏ.సిరి ప్రశంస పత్రాలు అందజేశారు. అందులో భాగంగా సెరికల్చర్ జిల్లా అధికారి డి. ఆంజనేయులు, అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ ఎం.పిమాసుమ్ వలి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ కె. జాన్ పాల్ అవార్డు అందుకున్నారు.


