NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్జీలు  ఒకటికి  నాలుగు సార్లు పరిశీలించి అధికారులు నాణ్యమైన పరిష్కారం చూపాలి

1 min read

ఈ రోజు పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు 294

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కారవేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి లు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, మండలాల్లో ప్రజలు నుండి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు  పరిష్కారం చెయ్యాలని అన్నారు. ప్రజలు నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగానే నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు అర్జీలు పరిష్కారంలో మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని, వారి చెంతకే వెళ్ళి అర్జీలను స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నట్లయితే వారికి మనోధర్యం, భరోసా కలుగుతుందని అన్నారు. తమశాఖ పరిధిలో  లేనివి అర్జీలు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలని, అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి జట్టిఠo అవుతుందని అన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో  శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా  అధికారులు, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి యన్.వి. నాంచారయ్య, సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author