తినేటిగల పెంపకం పై అవగాహన శిక్షణ కార్యక్రమం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణలోని వెలుగు కార్యాలయం నందు తినేటిగల పెంపకము పై డిపిఎం సురేష్ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంపై ప్యాపిలి నుంచి 60 మందిని ఎంపిక చేసినట్లు అలాగే తినెటీగల పెంపకనికి ఒక యూనిట్ కి 82 వేలు,10 బాక్సులు ఇస్తూ సంవత్సరానికి ఒక యూనిట్ కి 750 కేజీల తేనెను తాయరుచేయవచ్చు అన్నారు. తేనెటీగల పెంపకంపై జీవనాధారం చేసుకోవలసిన రైతులు ప్యాపిలి మహిళా మండలి సమైక్య కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని వాటికి అయ్యే ఖర్చు బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తూ రెండు సంవత్సరాలు వ్యవధిలో తిరిగి చెల్లించాలన్నారు. అబుల్ సంస్థవారు ప్రభాకర్ వారు ఈ తేనెను కొనుగోలు కూడా చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు జి. సరోజ, ఏపిఎం కృష్ణమూర్తి, మరియు సీసీలు, రైతులు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.


