ఈత పోటీల్లో ఐదు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీ సూర్య విద్యార్థిలు
1 min read

విద్యార్థిని,విద్యార్థులు జాతీయస్థాయిలో పతాకాలు సాధించాలని నా ఆకాంక్ష
స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర రావు
ఏకాగ్రత పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సౌత్ జోన్ స్టేట్ మీట్ ఈత పోటీలలో తమ పాఠశాల విద్యార్థి బలగ స్వామి నాయుడు అద్భుతమైన ప్రతిభ కనబరిచి 5 స్వర్ణ పతకాలు సాధించడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని, ఏకాగ్రత పట్టుదల ఉంటే దేనిలోనైనా రాణించవచ్చునని శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర రావు తెలిపారు. ఆకుంటిత దీక్షతో 5 స్వర్ణ పథకాలు సాధించిన స్వామి నాయుడు అభినందన సభ లో ఆయన మాట్లాడుతూ ఎంతో కృషి పట్టుదల ఉంటేనే ఇటువంటి అద్భుత విజయాలను సాధించడం సాధ్యపడుతుందన్నారు. జాతీయస్థాయి పోటీలలో అనేక పతకాలు సాధించిన స్వామి నాయుడు మన దేశం తరఫున ఒలంపిక్స్ లో పథకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటి విద్యార్థి తమ పాఠశాలలో చదవడం తమకు ఎంతో గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు స్వామి నాయుడు సోదరి భార్గవి కూడా సౌత్ జోన్ స్టేట్ మీట్ ఈత పోటీల్లో కాంస్యపతకం సాధించిందని ఆయన తెలిపారు. వీరిద్దరిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా విద్యతోపాటు వారు ఎంచుకున్న రంగంలో రాణించాలని విద్యార్థులకు ఉద్బోధించారు.

