NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాజిక రుగ్మతలను అధికమిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది

1 min read

-ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి జాతీయ సేవా పథకం స్పెషల్ క్యాంప్ లో భాగంగా 4వ రోజు ఎన్ఎస్ఎస్  వాలంటీర్స్  సామాజిక సాధికార సర్వే గ్రామం లో నిర్వహించి కొంత సమాచారాన్ని  సేకరించారు.  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి మాట్లాడుతూ సామాజిక సాధికారత అంటే సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు, గౌరవం, శక్తి అందించడం. ఇది కుల, మత, లింగ, ఆర్థిక వివక్షలను తొలగించి, ప్రతి వ్యక్తిని సమాజంలో బలోపేతం చేయడం. మన దేశంలో లక్షలాది మంది వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. వారికి విద్య, ఉపాధి, గౌరవం లేకపోవడం వల్ల సమాజం విభజనకు గురవుతోంది. సామాజిక సాధికారత ద్వారా మాత్రమే నిజమైన సమానత్వం వస్తుంది అని తెలిపారు. అనంతరం వాలంటీర్స్ మురుగు నీరు మన ఇంటి పరిసరాలలో నిలువ ఉండడం వలన దోమలు చేరి మనకు అనేక రోగాలు రావడానికి కారణం అవుతాయి కాబట్టి మురుగు నీరు నిలువ ఉండకుండా కాలువలను అప్పుడప్పుడు  శుభ్రం చేసుకోవాలి అని ప్రజలకు అవగాహన కల్పించి అనంతరం మురుగునీటి పై బ్లీచింగ్ పౌడర్  చల్లినారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ముస్తాక్, మురళి మోహన్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వన్నూరు, మంజునాథ్ మరియు ఎన్ఎస్ఎస్  వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author