NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బి.సి. రిజర్వేషన్ 42% అమలు కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న బందుకు మద్దతు  

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు లో బి. సి. సంఘాలు,బహుజన సంఘాలు బిర్లా గేట్ దగ్గర మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి  భాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది.తెలంగాణా బంధుకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేస్తూ విజయవంతం కావాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న జాతీయ బి.సి.సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి రంగస్వామి మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా అగ్రవర్ణాలే అన్ని పదవులు అనుభవిస్తూ బి.సి.లకు తీవ్ర అన్యాయం చేశారని ఇక మీదట అది చెల్లదని బి. సి.ల కోటా వారికి చెందే విధంగా చట్టం చేసి 9 వ షెడ్యూలు చేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది.లేని పక్షంలో బి.సి. ల తడాఖా చూపిస్తామని అగ్రవర్ణ ప్రభుత్వాలను హెచ్చరించారు.ఈ సమావేశంలోబి.సి.నాయకుడు అన్వర్ హుస్సేన్ మరియు బహుజన విద్యావంతుల నాయకులు జే.వి.కృష్ణయ్య, రామశేషయ్య, కురువ సంఘం నాయకులు గుడిసె శివన్న ఎం. కె.రంగస్వామి,వర్మ,నాగభూషణం,శివశంకర్,మాధస్వామి  దామోదరం రాధాకృష్ణ  మరియు పట్నం రాజేశ్వరి,విజయలక్మి, శేషఫణి,ధనుంజయ ఆచారి,బత్తుల లక్ష్మీకాంతయ్య, కురువ బలరాం, డేవిడ్, బ్యాంకు రాముడు, , సింధు నాగేశ్వరావు  విద్యార్థి సంఘాల నాయకులు,సాయికుమార్ విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.

About Author