NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐసిడిఎస్ ఉద్యోగి అంగలూరి శేషచార్యులు పదవి విరమణ

1 min read

కన్నుల పండుగగా సాగిన వీడ్కోల సభ

పెద్ద ఎత్తున పాల్గొన్న ఐసిడిఎస్ ఉద్యోగులు,ఏపీ ఎన్జీవోస్ నాయకులు, స్నేహితులు బంధుమిత్రులు

ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో శేష జీవితం గడపాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :అంగలూరి వెంకట నరశింహాచార్యులు, సత్యవతి వారి ఎనిమిదవ సంతానం  అంగలూరి శేషాచార్యులు ది.20-061963వ తేదీరకున వశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణము నందు జన్మించినారు. అంగలూరి శేషాచార్యులు వారి తల్లితండ్రులకు ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు సంతానము. అంగలూరి శేషాచార్యులు 8వ సంతానముగా జన్మించినారు. వీరి పూర్వ ప్రాథమిక విద్య నెం.5 పంచాయితీ సమితి ప్రాథమిక పాఠశాల నందు, 1 నుండి 5వ తరగతి, 6 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియెట్, బి.కామ్​ (డిగ్రీ), చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తణుకు పట్టణములో పూర్తి చేశారు. వీరు 6వ తరగతి నుండి డిగ్రీ స్థాయి వరకు ఎన్​సిసిలో క్యాడి, ఏ.బి.సి ధృవ పత్రములు ఎన్​ఎస్​స్​   మరియు ఎస్​ఎస్​ఎల్​లో కార్యకర్తగా విధులు నిర్వహించి, క్రమశిక్షణతో కూడిన వివిధ ట్రైనింగులు పొందియున్నారు.వీరు టైపు రైటింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత పొందినారు.అంగలూరి శేషాచార్యులు వీరి కన్నతల్లి అంగలూరి సత్యవతి  అయితే వీరిని పెంచిన తల్లి “మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ”లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు.1991వ సం:లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో టైపిస్టుగా విధి నిర్వహణలో చేరి, పశ్చిమ గోదావరి జిల్లా,సమిశ్రగూడెం, ఏలూరు,చింతలపూడి, బుట్టాయిగూడెం నందు పనిచేసి, 2000వ సంవత్సరంలో సీనియర్ అసిస్టెంటుగా పదోన్నతిపై కృష్ణా జిల్లా, మొవ్వ గ్రామములోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు 2008వ సంవత్సరం వరకు పనిచేసి బదిలీపై ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయము కాకినాడ, ఏలూరు నందు పనిచేసి 2019వ సంవత్సరం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్, భీమడోలు నందు పనిచేస్తూ ది.30-06-2025వ తేదీన పదవీ విరమణ పొందుచున్నారు.అంగలూరి శేషాచార్యులు పశ్చిమ గోదావరి జిల్లా కోరుకొండ గ్రామ కాపురస్తులు, తూర్పు గోదావరి జిల్లా ఇవగవరపు నరసింహాచార్యులు, రాధాతాయారుల 5వ సంతానము సౌమ్యురాలు అయిన శారదను 24-04-1992వ తేదీన వివాహము చేసుకునియున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానము. సత్యశ్రీ. M.Tech మరియు సాయి సంధ్య, M.Sc. వారి కుమార్తెలు ఉన్నత విద్యను అభ్యసించరు. వీరి సంతానమునకు వివాహము చేసినారు. పెద్ద అల్లుడు వేణుగోపాల్ మరియు చిన్న అల్లుడు ఉదయ్ శ్రీవత్సవ వారి ఇరువురు అల్లుళ్ళు ఇంజనీర్లు గా కొనసాగుతున్నారు.అంగలూరి శేషాచార్యులు 30-06-2025న పదవీ విరమణ అనంతరము, ఆయురారోగ్యములతో కుటుంబసభ్యులతో నిండు నూరేళ్ళు సుఖముగా, సంతోషముగా జీవించాలనిపలువురు వక్తలు సభా వేదికపై కొనియాడుతూ హర్షద్వనుల వర్షం కురిపించారు. పూల మొక్కలు అందించి. శాలువాలు కప్పి గజమాలతో పెద్ద ఎత్తున సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుండి ఎంతోమంది సొంత శాఖ ఉద్యోగులు,మహిళా ఉద్యోగులు,స్నేహితులు, బంధుమిత్రులు ఏపీ ఎన్జీవోస్ మరియు వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి ఆయన నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో శేష జీవితం గడపాలని ఆకాంక్షించారు.

About Author