NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“బాబు షూరిటీ.మోసం గ్యారెంటీ”

1 min read

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే… చంద్రబాబు చేసిన మోసాలు తెలుస్తాయి..

కర్నూలు, న్యూస్​  నేడు:  వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఉమ్మడి కర్నూలు జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరియు నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారి ఆధ్వర్యంలో “బాబు షూరిటీ — మోసం గ్యారంటీ” నంద్యాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి,మండల స్థాయి మరియు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ గ్రామానికి ప్రచారం కార్యక్రమం దశల వారీగా  రెండో దశ (జూలై 4వ తేదీ నుండి 12వ తేదీలోపు)…గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు/ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త – నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ:నియోజకవర్గంలోని కీలక మైన నాయకులు అంతా హాజరు కావాలి. ఇందులో మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే ఆయా కమిటీల సభ్యులు హాజరుకావాలి.

మూడో దశ (జూలై 13వ తేదీ నుండి 20వ తేదీలోపు)…

గౌరవ శాసన సభ్యులు/ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో – మండలస్థాయిలో విస్తృత సమావేశం నిర్వహణ:ఇందులో మండల పార్టీ అధ్యక్షులతో సహా, పార్టీ మండల కమిటీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే ఆయా కమిటీల సభ్యులు హాజరుకావాలి.నాలుగో దశ (జూలై 21వ తేదీ నుండి ఆగష్టు 4వ తేదీలోపు)…గ్రామస్థాయిలో కార్యక్రమ నిర్వహణ:గ్రామ స్థాయి కార్యక్రమ నిర్వహణను సమన్వయకం చేసుకునేందుకు మండల స్థాయిలో రెండు కమిటీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.మండలస్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు ప్రతిరోజూ కార్యక్రమం జరుగుతున్న గ్రామాన్ని సందర్శించి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సహా ఇతర కార్యకర్తలు, కమిటీ మెంబర్లు సమక్షంలో ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి అని పార్టీ క్యాడర్ కు దిశ నిర్దేశం చేశారు.ఈ నంద్యాల మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి , శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గారు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి , ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి , నందికొట్కూరు ఇంచార్జ్ దారా సుధీర్ , ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ,గంగుల ప్రభాకర్ రెడ్డి ,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ,నంద్యాల జిల్లా జడ్పిటిసిలు,  ఎంపీపీలు,పార్టీ మండల అధ్యక్షులు,జిల్లా పార్టీ కమిటీ సభ్యులు,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి అనుబంధ విభాగాల యందు వివిధ హోదాలలో ఉన్నవారు పాల్గొన్నారు.

About Author