కిలారి దేశపు ఎద్దుల బండలాగుడు పొటీలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శనివారం ప్యాపిలి మండల పరిధిలోని యర్రగుంట్ల పల్లి గ్రామంలో కిలారి దేశపు ఎద్దుల బండలాగుడు పొటీలు నిర్వహించారు.మొదటి బహుమతి జొన్నగిరి మస్తాన్ కు చెందిన వృషభ రాశులు గెలుపొందగా మొదటి బహుమతిని 30 వేల రూపాయలను పి.రజిని కాంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందజేశారు.గోవిందవాడ చెందిన వృషభలు రెండవ బహుమతి గెలిపోందగ 20వేలు మహందర్ రెడ్డి అందజేస్తూ అలాగే వెంగన్న పల్లి చెందిన వృషభలు మూడ బహుమతి15వేలు, నాలుగు వ 10వేలు బహుమతి గోవిందవాడ కు,ఐదవ బహుమతి 8వేలు లింగదార కు చెందిన వృషభలు గెలుపు సాధించినాయి. గెలుపొందిన వృషభరాశుల యజమానులకు ఘనంగా సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.


