NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాస్థాయినెట్ బాల్ పోటీలలో తృతీయ స్థానం సాధించిన బిక్యాంపు స్కూల్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలలో ప్రభుత్వ బి క్యాంపు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచి కాంస్యపథకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి శంకర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి నెట్ బాల్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొని జిల్లాస్థాయిలో తృతీయ స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు.విద్యార్థులు ఈ పోటీలలో సాధించిన పథకాలు ప్రశంసా పత్రాలతో వారి ఉన్నత చదువులలో రాణించేందుకు దోహదపడతాయన్నారు.భవిష్యత్తులో జరిగే క్రీడా పోటీలలో రాణిస్తూనే చదువులోనూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.పాఠశాల విద్యార్థులకు క్రీడలలో శిక్షణ ఇస్తూ పోటీలలో రాణించేందుకు కృషి చేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు జగన్మోహన్ ఆచారి ,విజయ్ కుమార్ లను అభినందించారు.

About Author