NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కీళ్ల వ్యాధుల లక్షణాలను ముందే గుర్తించాలి

1 min read

ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ సృజన

కర్నూల్ హాస్పిటల్, న్యూస్ నేడు  : రుమటాలజీ అవగాహన నెల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం – మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలురుమటాలజీ అవగాహన నెల (ఏప్రిల్) సందర్భంగా Medicover Hospitals Kurnool లో కీళ్ల సంబంధిత వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థ్రైటిస్, జాయింట్ పెయిన్, ఆటోఇమ్యూన్ వ్యాధులు వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ Dr Srujana A  పాల్గొని కీళ్ల వ్యాధుల లక్షణాలు, కారణాలు మరియు ఆధునిక చికిత్స విధానాలపై వివరించారు. రాయలసీమ ప్రాంతంలో సేవలందిస్తున్న ఏకైక రుమటాలజిస్ట్‌గా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె మాట్లాడుతూ  కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం గట్టితనం (stiffness) వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే రుమటాలజీ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. ఆటోఇమ్యూన్ వ్యాధులు శరీర రోగనిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల వస్తాయని, సరైన చికిత్సతో సాధారణ జీవితం గడపవచ్చని వివరించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్​ రెడ్డి  మాట్లాడుతూ, “రుమటాలజీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన చాలా అవసరం. ఈ వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స పొందితే దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. మా ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల ద్వారా ఆధునిక చికిత్సలు అందిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *