NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత మహిళలకు వన్ స్టాఫ్ సెంటరు ద్వారా మెరుగైన సేవలు అందించాలి

1 min read

వరకట్నం నిషేధ చట్టం పక్కాగా అమలు చెయ్యాలి, బాల్య వివాహాలు జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి

బాధిత మహిళలు, బాలికలు సహాయం కోసం టోల్ ఫ్రీనెంబర్లు 112, 181, 14416  ద్వారా తెలియ జెయ్యవచ్చును

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బాధిత మహిళలు సహాయం కోసం ఏర్పాటుచేసిన వన్ స్టాఫ్ సెంటరుకు సహాయం కోసం వచ్చిన మహిళలకు మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారుజిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం వన్ స్టాఫ్ సెంటరు & వరకట్న నిషేధ చట్టంపై త్రైమాసిక సమీక్ష మరియు కన్వర్జెన్స్ సమావేశ సలహా బోర్డు మిషన్ శక్తి కింద సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వన్ స్టాఫ్ సెంటరు ద్వారా మహిళలు, బాలలకు అందుతున్న సహాయ కార్యక్రమాలపై జిల్లా కలెక్టరు అధికారులతో కలిసి సమీక్షించారు. టోల్ ఫ్రీ ద్వారా, పిజిఆర్ యస్ ద్వారా ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయని మండలాలు వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గృహహింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, తదితర బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించి, వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సహాయం అందించడం వన్ స్టాఫ్ సెంటరు సిబ్బంది బాధ్యత అన్నారు. బాధిత మహిళలు, పిల్లలకు వారి సమస్యలను గుర్తించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగు ఇవ్వడం, అవసరమైతే ఎఫ్ ఐఆర్ కేసు నమోదు చేసి వారికి సత్వర న్యాయం అందించే దిశగా వన్ స్టాఫ్ సెంటరు సిబ్బంది కృషి చెయ్యాలని అన్నారు. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు సమస్య బాధితులు టోల్ ఫ్రీ 112, 181, 14416 నెంబర్లకు కాల్ చేసి  సహాయం పొందవచ్చునని, బాధితులకు ఉపయోగపడేలా ఈ ఫోన్ నెంబర్లు అన్ని ప్రధాన కూడళ్లలో డిస్ ప్లే చెయ్యాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అదనపు ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఐసిడి యస్ పిడి పి.శారద, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, యల్డియం డి.నీలాద్రి,  వన్ స్టాఫ్ సెంటరు అడ్మినిస్ట్రేటర్ సిహెచ్. నిర్మల, నోడల్ అధికారి ఏలూరు తులసి, కమీటీ సభ్యులు, ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు.

About Author