NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

1 min read

నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని15 లోపు కమిటీల డిజిటలైజేషన్ పూర్తి

హాజరైన ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి,బుడ్డా శేషారెడ్డి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుదామనిఅదేవిధంగా ఈ ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం సహించే ప్రసక్తే లేదని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంగోపాల్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుధీర్ స్వగృహంలో గురువారం డాక్టర్ సుధీర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి కాటసాని రాంభూపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతా రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడారు.ఆ తర్వాత కల్పలతా రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 15 లోపు అన్ని కమిటీలను పూర్తి చేసి వివరాలను డిజిటలైజేషన్ చేయాలని పార్టీకి కార్యకర్తలే పునాది పార్టీకి కార్యకర్తలే బలంగా ఉన్నారనే నమ్మకంతోనే మన అధినేత జగన్ ఉన్నారన్నారు.జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగి చెందారన్నారు.నియోజకవర్గానికి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొస్తామని అదేవిధంగా 2004 నుండి నందికొట్కూరు వైసిపి కంచుకోట అని నాయకులు కార్యకర్తల నిర్లక్ష్యంతోనే ఇక్కడ ఓడిపోయామన్నారు.డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారని ప్రతి కార్యకర్త కష్టపడి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కార్యకర్తల సందేహాల కోసం నియోజకవర్గంలో లీగల్ అడ్వైజరీ ఏర్పాటు చేయాలని ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు,ఎంపీపీలు సర్పంచులు,ఎంపీటీసీలు వివిధ విభాగాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author