NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్యాపిలిపట్టణంలో బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బిజెపి జెండా దేశ ప్రజలకు అండ అని నంద్యాల జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కేసీ మద్దిలేటి, ప్యాపిలి మండల బిజెపి అధ్యక్షులు కేబి.దామోదర్ నాయుడు, యువ మోర్చా ప్యాపిలి మండలం అధ్యక్షులు శివ కేశవులు అన్నారు . ముందుగా పట్టణంలో మొట్టమొదటిసారి యువ మోర్చా అధ్యక్షులు శివ కేశవ ఆధ్వర్యంలో జండా కట్టను ఏర్పాటు చేసి,పతాకావిష్కరించారు.ఈ సందర్బంగా యువమోర్చా అధ్యక్షులు శివకేశవ మాట్లాడుతూ దేశాభివృద్ధికి కట్టుబడిన పార్టీ బిజెపి పార్టీ అని విప్లవాత్మక నిర్ణయాలతో పిఎం నరేంద్ర మోడీ  దేశాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచారని , అమరావతి నిర్మాణంతో సహా ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ప్యాపిలి , జలదుర్గం చంద్రపల్లి, గార్లదిన్నె గ్రామాలలో బిజెపి జండాను ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *