అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయండి
1 min read

కమిషనర్ ను కోరిన నాయకులు..
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు పట్టణంలో ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని దళిత మరియు ప్రజా సంఘాల నాయకులు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డిని కోరారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ,ప్రజా సంఘాలు మరియు వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో కమిషనర్ కు వేడుకలకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహం పక్కన పబ్లిక్ మీటింగ్ నిర్వహించుటకు సమావేశ వేదిక,పెండ్యాలు,సౌండ్ సిస్టం,కుర్చీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను వారు కోరారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం ప్రక్కన ఎలాంటి రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు,కుల సంఘాలు ప్రజాసంఘాల ఫ్లెక్సీలు,కట్టరాదని తెలిపినట్లు వారు అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు తగిన ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ డి వెంకటేష్,మరియు మాల మహానాడు నాయకులు బండారి శ్రీనివాసులు,అరే రాజు,నందికొట్కూరు ఎంఆర్ పిఎస్ మండల అధ్యక్షులు జాన్ మాదిగ,సీనియర్ నాయకులు పరిమల రాజు మాదిగ,రాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

