NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కన్నులపండువగా శ్రీ రాములోరి కళ్యాణం

1 min read

పెళ్ళి కి పెద్దలుగా వరుడు తరుపున భాస్కర్ దంపతులు, వధువు తరుపున  బొంబాయి శివ దంపతులు

భారిగా తరలి వచ్చిన భక్తులు

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం పాత ఊరిలోని  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం పాంచరాత్ర అఘామోక్తంగా కన్నులపండువగా జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చనాలా  నడుమ శ్రీ ఆంజనేయ స్వామికి, ఉత్సవ మూర్థులు సీతారామ సహిత లక్ష్మణ స్వామి వారికీ  పాలు, పెరుగు, తేనె,కొబ్బరినీరు వంటి వివిధ పళ్ళ రసాలు ద్రవ్యాలతో విశేష పంచామృతాభిషేకం  నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో పాంచరాత్ర  ఆగమం ప్రకారం అసూరి  సునీల్ కుమార్ చార్యులు ఆధ్వర్యంలో   సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, కంకణ ధారణ చేసి మాంగళ్య ధారణ చేశారు. వరుడు తరుపున భాస్కరా చార్యుల దంపతులు ,వధువు తరుపున బొంబాయి శివ దంపతులు కూర్చున్నారు. అనంతరం మంగళ వాయిద్యాలు,భాజా భజంత్రీలు నడుమ శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపైన  వేంచింప జేసి  గ్రామ పురవీధుల్లో  ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భీమాచార్యులు, మధుసూదనా చార్యులు, సూర్యనారాయణ చార్యులు భాస్కరాచార్యులు శ్రీనివాసచార్యులు, మంత్రాలయం  మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచ్ తెల్ల బండ్ల భీమయ్య,గోరుకల్ క్రిష్ణ స్వామి,కురువ మల్లికార్జున, శివప్ప ,  వరదరాజులు, గోల్డ్ స్మిత్ నరసింహ,  ఎంపీటీసీ నెక్కి వేంకటేష్  గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author