దిగువ కోర్ట్ లలో ఉద్యోగాల పరీక్ష నిర్వహణ కేంద్రాల పరిశీలన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుండి 24 వరకు దిగువ కోర్ట్ లలో వివిధ ఉద్యోగాల కొరకు పరీక్షలు జరుగుచున్నవి. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుచున్న పరీక్షలను ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయ మూర్తి జి. కబర్థి మరియు నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు యే విధమైన అసౌకర్యం మరియు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బంది ని ఆదేశించారు.

