NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

40 రోజుల మాల దీక్షదారులకు అల్పాహారం ఏర్పాటు

1 min read

ప్రతి ఏట బండారి ఆనంద్ ఆర్థిక సాయం అభినందనీయం

అధ్యక్షా,కార్యదర్శి సొంగ మధుసూదనరావు,యర్రా జయదాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ అధ్యక్ష , కార్యదర్శి సొంగ మధుసూదన రావు,యర్రా జయదాస్  ఆధ్వర్యంలో సెయింట్ మైకేల్ పారిస్  ప్రాంగణంలో క్రీస్తు తపస్సు కాలo సందర్భంగా 40 రోజులు దీక్ష మాల ధారణ వహించే వారికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘస్తులకు బుధవారం సుమారు 100 మందికి అల్పాహారం ఆనుగుల బండారి ఆనంద్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఆనంద్ అల్పాహారానికి ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం సెయింట్  మైకేల్  విచారణ గురువులు రెవ, ఫాదర్:దిరిసిన ఆరోను సందేశాత్మక వాక్యోపదేశంతో, భక్త బృందం ఆధ్యాత్మిక  గీతాలాపనలతో ప్యారిస్ ప్రాంగణమంతా పవిత్రత చేకూరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు వైఎస్ఆర్ సిపి కన్వీనర్  మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి) స్థానిక కార్పొరేటర్ ఎండి రియాజ్ అలీ ఖాన్, నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ నాయకులు నెరుసు చిరంజీవి, కైకలూరు నియోజకవర్గం పరిశీలకులు నూక పెయ్యి  సుధీర్ బాబు, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి మున్నులు జాన్ గురునాథ్, దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు కృష్ణ , వైసిపి కల్చరల్ విగ్  నాయకులు మేతర సురేష్ , మరియు సంఘ పెద్దలు ఉపదేశకులు, విన్సెంట్ పాల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author