NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి…

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ,కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు లేబర్  కోడ్ లు  మార్చడాన్నీ  వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి ముక్కెళ్ల అశోక్ లు మండల కార్మిక , వ్యవసాయ కార్మిక రైతు వర్గాలకు వారు విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు స్థానిక సిఐటియు కార్యాలయం నందు వారు మాట్లాడుతూ, 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ హాయంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అనుసరిస్తున్నారని అందులో భాగంగానే  పోరాడి సాధించుకున్న బ్రిటిష్ కాలం నాటి 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదింపు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని, దేశంలో లక్షలాదిమంది కార్మికులుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు నేటి వరకు అమలుకు నోచుకోవడం లేదని, కార్మికులందరికీ కనిస వేతనాలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో  పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, దేశంలో  పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజువారి కూలీ వేతనాలను 600 రూపాయలు ఇవ్వలని, డిమాండ్​.

About Author