చెత్త రహిత నగరమే లక్ష్యం…
1 min read

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
డోర్‌టుడోర్ చెత్త సేకరణ వంద శాతం నిర్వహిస్తాం
చెత్తా సేకరణకు 91 ఎలక్ట్రిక్ వాహనాలు
కర్నూలు మున్సిపల్, న్యూస్ నేడు : కర్నూలు నగరంలో అనేక మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టి చెత్తా రహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని గార్గేయపురం, జొహరపురం ప్రాంతాల్లో డంప్ యార్డులను పరిశీలించారు. అనంతరం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ పి.విశ్వనాథ , మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. కర్నూలును చెత్తా రహితంగా తీర్చిదిద్దుతున్నామని, ఆ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. చెత్తా సేకరణకు 91 ఎలక్ట్రిక్ వాహనాలను టెండర్ పిలిచామని, రెండు మూడు నెలల్లో నగరానికి వస్తాయని పేర్కొన్నారు. జొహరపురం, గార్గేయపురం డంప్ యార్డుల్లో లెగసి, సాలిడ్ వెస్టేజ్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశామన్నారు. జోహరపురం డంప్ యార్డులో చెత్త నుండి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గార్బేజ్ ట్రొన్సపోర్ట్ సిస్టం (జిటియస్) త్వరలో తీసుకోరాబోతున్నామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండు వాహనాలు మంజూరు చేస్తున్నామని, తద్వారా వాహనాల ప్రయాణం తగ్గించవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

